ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూ సేవలకు ఆధార్ లింక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:22 AM

 కూటమి ప్రభుత్వం రెవెన్యూ సర్వీసులకు ఆధార్‌‌ను లింక్ చేసింది. భూమి రికార్డులు, కులం-ఆదాయ ధ్రువీకరణ, మ్యుటేషన్ సర్టిఫికెట్లు, 22ఏ దరఖాస్తులు, సబ్ డివిజన్ వినతులు వంటి సేవలకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అనుమతించింది. ఇది పూర్తిగా స్వచ్ఛందం మాత్రమేనని, ఆధార్ లేకపోయినా, ధ్రువీకరణ విఫలమైనా సేవలను నిరాకరించకూడదని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ మేరకు రెండు జీవోలు జారీ చేసింది. ఆధార్ లేకపోతే ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా ఈ సేవలు పొందే వీలుంటుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa