ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశాంత్ ఇన్సూరెన్స్ వివాదం: రాజస్థాన్ రాయల్స్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:35 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్, మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధించిన పాత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2012లో శ్రీశాంత్‌కు జరిగిన గాయంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలోనే ఈ వివాదం మొదలైంది.రాజస్థాన్ రాయల్స్ దాఖలు చేసిన ఈ క్లెయిమ్‌ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.అసలు వివాదం ఏమిటి?2012లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో మోకాలి గాయం పాలయ్యాడు. దీంతో ఆ సీజన్ మొత్తాన్ని మిస్సయ్యాడు. ఈ కారణంగా ఫ్రాంచైజీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.82.80 లక్షల క్లెయిమ్ కోరింది. అయితే ఇన్సూరెన్స్ సంస్థ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం — శ్రీశాంత్‌కు 2011 నుంచే కాలి వేలికి గాయం ఉండేది. ఆ విషయం పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించలేదని, అదే పాత గాయం కారణంగా 2012లో ఆడలేకపోయాడని పేర్కొంది.దీనికి భిన్నంగా రాజస్థాన్ రాయల్స్ మాత్రం — కాలి వేలి గాయం పెద్ద సమస్య కాదని, ఆ గాయంతో కూడా శ్రీశాంత్ ఆడాడని వాదించింది. 2012లో కొత్తగా మోకాలికి గాయం కావడంతోనే అతను ఆడలేకపోయాడని, కాబట్టి క్లెయిమ్ తమకే రావాలని చెప్పింది.సుప్రీంకోర్టు విచారణగతంలో ఈ కేసులో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) రాజస్థాన్ రాయల్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఈ కేసును విచారించారు. ఈ సందర్భంగా వారు — కాలి వేలి గాయం విషయం ఇన్సూరెన్స్ కంపెనీకి ముందే తెలిపారా లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ తెలిపి ఉంటే కంపెనీ పాలసీ ఇవ్వకపోవచ్చు లేదా అధిక ప్రీమియం వసూలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, శ్రీశాంత్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సహా పత్రాలను సమర్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ పత్రాలు సమర్పించిన తర్వాత విచారణను మళ్లీ ప్రారంభిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa