రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు కొన్ని చోట్ల పూర్తయ్యిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో కూటమి నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాంతో ప్రభుత్వం దృష్టిని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకరించింది. ఈ సందర్భంగా నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ:"రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వంతో సంప్రదించబోతున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల కొనుగోలు మరియు వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa