అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం దొరగూడ గ్రామ గిరిజనులు రేషన్ తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్ష్మీపురం జీసీసీ డిపోకు చేరేందుకు ఉబ్బెంగుల వాగు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నా ప్రాణాలకు తెగించి దాన్ని దాటి, 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడూ అదే తడవు. వాగుపై వంతెన నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa