ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14.09.2025 నుండీ 20.09.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 08:43 AM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో పౌరుషంగా మీరు మాట్లాడే మాటల వల్ల తోబుట్టువులతోనూ, క్రింద పనిచేసే సిబ్బందితోనూ, ఆత్మీయులతోనూ ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి.మాటల వల్ల, పూర్వపు ప్రమాణాల వల్ల ఆర్థిక, కుటుంబ వ్యవహారాలలో అభిప్రాయ భేదములు వచ్చే అవకాశములున్న రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ముఖ్యంగా మీ భాగస్వామి కుటుంబ సభ్యులతో చర్చలలో పాల్గొనేటప్పుడు, ముఖ్యుల నుంచి దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందడం వలన గాని కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ దానిని నియంత్రించుకో కలిగిన శక్తి మీరు అభివృద్ధి చేసుకోగలరు. అనవసర వ్యక్తుల జోక్యం భాగస్వామ్య వ్యవహారాలలో చికాకును రెట్టింపు చేస్తుంది. స్థిరాస్తుల విషయంలో వాహన సదుపాయాలలో, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాలలో ఉండే సంతానము యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో అభిప్రాయ బేధాలు తగినంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రథమ సంతానము కొరకు ఎక్కువ స్థాయిలో ఆలోచనల చేస్తారు.  మరిన్ని మంచి ఫలితాల కొరకు గణేషఆరాధన దేవాలయసందర్శన  మేలు.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  ప్రారంభంలో ముఖ్యంగా  ఈ రాశి వారు అనవసర చికాకులకి దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఇమేజ్ ని కాపాడుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ న్యాయపరమైన విషయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్లాలి. ఆరోగ్య మానసిక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,  ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. సాంఘిక సంబంధాల విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ, ఆధ్యాత్మిక స్త్రీలతోనూ వ్యవహరించేటప్పుడు, సంబంధం లేని కొత్త వ్యక్తుల జోక్యంతోను మనసు స్థిమితం తగ్గుతుంది. ప్రియమైన వ్యక్తులతో వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో  వ్యాపార భాగస్వాములతోనూ అపార్థములకు దూరం మంచిది. వారం మధ్యలో అన్నదమ్ములతో, కొలీగ్స్ తో వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో అపార్థాలకు, మాట పట్టింపులు అవకాశం ఇవ్వరాదు. వారం చివరిలోవీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ సౌఖ్యం, వాహనంశాలు, మొదలైన విషయాల్లో జాగ్రత్త అవసరం. మరిన్ని మంచి ఫలితాల కొరకు నవగ్రహ శ్లోక పారాయణ, దేవాలయ సందర్శన మేలు


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


ప్రారంభంలోమానసిక ప్రశాంతత తక్కువగా ఉండడంతో పాటు, ఏదో తెలియని ఒంటరితనం ఆలోచనలు అధికం. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యము తగదు.  అనవసర ఖర్చులు, ప్రయాణాలు, అధికంగా ఉంటాయి.  విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రద్ధ తక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించుకొనుటకు హయగ్రీవాయ నమః శ్లోకము జపించటం మేలు. భాగస్వామి ఆరోగ్యం కొరకు ఖర్చుల. వ్యాపార రంగంలో ఉండే వారితో  ఆర్థిక సంబంధమైన అంశాలలో మాట పట్టింపులకు జగడములకు దూరము మేలు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య సంబంధిత దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. పౌరుషంగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులతో దూరం పెరుగుతుంది. పన్ను కన్ను మొదలు వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వారం చివరిలో తోబుట్టువుల సహకారంతో చర్చలతో కొన్ని కీలక నిర్ణయాలు, మానసిక ప్రశాంతత అభివృద్ధి కొరకు తీసుకుంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు మహాలక్ష్మి ఆరాధన దేవాలయ సందర్శన మేలు.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో, లాభాలలో నూతన ప్రయత్నాలు, అవకాశాలు కొత్త ఆశల్ని చిగురింపచేస్తాయి. దూర ప్రయాణాలకి అవకాశములు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. మిత్రుల కొరకు, దూరపు ప్రదేశాల్లో ఉండే ఆప్తుల కొరకు అధిక ఖర్చులు.  మార్కెటింగ్ రంగంలో ఉండేవారు కొత్త అవకాశాల్ని చేజిక్కించుకుంటారు. వస్తు వాహన సేకరణ కొరకు ప్రణాళికలు. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో గాసిప్స్ కి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చుల్ని నిరోధించాలి. శత్రు రోగ రుణాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది, స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి తరుపు బంధువుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారాంతంలో విందు వినోదాల్లో పాల్గొంటారు, నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, మిత్రులు రాక మానసిక ప్రశాంతత పెరుగుతుంది  మరిన్ని మంచి ఫలితాల కొరకు గణేష ఆరాధన దేవాలయ సందర్శన మంచిది.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలో శక్తికి మించిన పనులు. అయినప్పటికీ పడుతున్న శ్రమకి తగిన విధంగా ఫలితం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రద్ధ బాధ్యతలు ఒత్తిడి అధికంగా ఉంటాయి.  వృత్తిపరంగా కొత్త ప్రదేశాలలో నూతన అవకాశాల కొరకు దూర ప్రదేశాలలో ఉండే మిత్రుల సహకారంతో ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రియమైన వ్యక్తుల విషయంలో, సంతానం అభివృద్ధి, పెట్టుబడుల సంబంధించిన విషయాలలో అనుకూలమైన కొత్త ఆలోచనలు చేస్తారు. వ్యక్తులతో విభేదాలు రాకుండా ఉద్వేగాలను సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళ్లాలి. వారాంతములో స్నేహితులతో  కలిసి దగ్గర ప్రయాణానికి, వారి ఆరోగ్యము అభివృద్ధి అవసరముల నిమిత్తము కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు ప్రయాణం చేస్తారు.  మిత్రులతో కలిసి చర్చించుట వల్ల కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్ట్స్ మొదలైన వాటి వల్ల మీ ఎఫెక్ట్స్ ఫలించి మానసిక సంతృప్తి పెరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో క్షేత్ర సందర్శన చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉపాసన బలాన్ని పెంచుకుంటారు.  సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే వారికి దూర ప్రదేశాల్లో విద్యా అవకాశాలు. వృత్తి వ్యాపారాలు చేసే ప్రదేశాల్లో ఆటంకాలు ఆలస్యాలు పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల కొంత చికాకులు కలుగుతాయి. వారము చివరిలో పూర్వపు  అప్పులు తీరుస్తారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, విద్యార్థులకు పోటీలలో గట్టి శ్రమ తో ఫలితాలు సాధిస్తారు. భూమి కొనుగోలు పెట్టుబడుల మీద, లేదా సంబంధించిన ఆదాయం రాకడ మీద  ద్రుష్టి నిలుపుతారు. గృహ వాతావరణం కొంత అశాంతి అసంతృప్తి ఎమోషన్స్ తో కూడి ఉంటుంది.  ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తి ఉంటుంది బంధువుల రాక, ఒత్తిడి, నిద్రలేమి అధికంగా ఉంటాయి.  దాన్ని అధిగమించడానికి సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయ నమః  మేలు


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభంలో మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి యోగ మెడిటేషన్ వంటివి చాలావరకు ఉపయోగకరంగా ఉంటాయి, ముఖ్యంగా నిద్రలేమి, అనుకోని చికాకులు, ఆర్థిక విషయాలు స్థిరాస్తుల సంబంధ విషయాలలో నిర్ణయ సామర్థ్యం, మానసిక విశ్రాంతి లేని తనం వల్ల కూడా కొంత ఆలోచనలు పదేపదే రావడం వల్ల కూడా ఇబ్బందులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది తెలియని ఆందోళన అధికంగా ఉంటుంది  ఆధ్యాత్మిక చింతనని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఆలస్యాలు. ప్రయాణాలు, ఉన్నత విద్యాసంబంధ అంశాలు, ఆర్థిక భూసంబంధ అంశాలు, పూర్వపు పెట్టుబడుల మీద వచ్చే ఆదాయపు ఆలోచనలలో అంతరాయాలు. కుటుంబంలోని వ్యక్తులతో మాట పట్టింపులు ఘర్షణ కోపానికి దూరంగా ఉండాలి, తీసుకునే ఆహార విషయంలో కూడా అధిక శ్రద్ధ అవసరం, వారం మధ్యలో వృత్తి సంబంధ విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో సహకారాన్ని అభివృద్ధిని కోరుకుంటారు. సంతానము యొక్క అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలు మీ ఎఫెక్ట్స్ తో ముందుకెడతాయి. వృత్తి చేసే ప్రదేశాలలో అసంతృప్తిని అధిగమించాలి. ఆర్థిక విషయాలు అసంతృప్తి. వారం చివరిలోగృహ వాహన కొనుగోలు, పెట్టుబడులు రాబడులు విషయాలలో కొలిక్కి వస్తాయి. ఆలస్యంగా నైనా ఎదురుచూసిన విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆకర్షణ పెరుగుతుంది  మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గా, గణేష దేవాలయ సందర్శన, శ్లోక పారాయణ మంచిది.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య మీద శ్రద్ధ వారి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయినూతన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. విదేశాల్లో ఉండే స్వదేశీ వ్యక్తులతో చర్చలు అనంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో భాగస్వామితోనూ, వారసత్వపు అంశాలు  కుటుంబ సభ్యులతోనూ ఘర్షణాత్మక వైఖరికి దూరంగా ఉండడం మంచిది. రహస్య శత్రువులని అధిగమించడానికి, వృత్తిలో నైపుణ్యాలు పెంచుకోవడానికి, న్యాయపరమైన అంశాల మీద శ్రద్ధతో కొంతవరకు ఖర్చులు చేస్తారు. కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులకు, ఆర్థిక విషయాలలో ప్రమాణాలకు, అది నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్య లకు  తగినంత దూరంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతతను పెంపొందించుకున్న వారవుతారు. వృత్తిపరమైన విషయాలలో శ్రమతో విజయాన్ని సాధిస్తారు. తల్లిదండ్రుల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి వారికి తగిన సౌకర్యాలని గౌరవాన్ని ఇవ్వాలి. స్థిరాస్తులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడంలో కొంతవరకు సఫలం అవుతారు.  మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన ఆరాధనా మంచివి


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


వారం ప్రారంభంలో నూతన శక్తి పెరుగు తుంది, కొత్త ఆలోచనలు చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి శత్రువుల, రుణాలు మీద విజయాన్ని సాధిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తారు న్యాయపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నిత్య జీవితంలో మార్పు కొరకు కృషి చేస్తారు. ముఖ్యంగా యోగ మెడిటేషన్ వాకింగ్ మొదలైన వాటి మీద శ్రద్ధ చూపిస్తారు. జాయింట్ వ్యవహారాల మీద దృష్టిని సారిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలు చేస్తారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఉన్నతమైన సమయంగా చెప్పొచ్చు. పోటీల మీద ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమతో మంచి విజయాన్ని సాధిస్తారు. వారము మధ్యలో ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని ధనం అందినా కూడా దానిని ప్రణాళికా పరంగా ఖర్చు చేయకపోయినట్లయితే అనవసర ఖర్చులు అధికమవుతాయి.  వృత్తిపరమైన గౌరవాన్ని అభివృద్ధినిపొందుతారు.డ్రైవింగ్ చేసే వ్యక్తులు తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి.మంచి ఫలితముల కొరకు లలితా సహస్ర నామ పారాయణ మేలు


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వారం ప్రారంభంలోముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వృత్తి వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో సంతాన సంబంధ అంశాలలో, పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలలో శాంతి తక్కువగా ఉంటుంది.  మానసిక అశాంతి ఆందోళన అధికంగా ఉంటాయి.  ముఖ్యంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించి విజయాలు సాధించాలి.అనవసరమైన డిప్రెసివ్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. అనవసర ఆలోచనలు అపోహలు చికాకు కలిగిస్తాయి. పెద్దలు గురువులు మొదలైన వారి డైరెక్షన్లో క్రమశిక్షణతో ముందుకు వెళ్లి అనుకున్న పనులు సాధించాలి. బెట్టింగులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఇతరులకు రుణములు ఇచ్చే విషయంలో, భాగస్వామి ఆరోగ్య, వ్యాపార అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  వారం చివరలలో ముఖ్యమైన అంశాలు వాయిదా, ఆరోగ్య విషయం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తగవు .మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామి శ్లోక పారాయణ దేవాలయ సందర్శన.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి విషయాలలో సమయాలలో మార్పులు ఆరోగ్యపరమైన అంశాలలో చికాకుని రెట్టింపు చేస్తాయి.గృహ వా తవరణం కొంత అసౌకర్యంగా, స్థిమితం తక్కువగా ఉంటుంది. అధికారులతో అభిప్రాయ బే దములకు దూరంగా ఉండాలి.  చరస్థిరాస్తులు, పెట్టుబడుల విషయంలో, నిర్ణయ సామర్థ్యం తగ్గుతుంది. తల్లి ఆరోగ్యం, డ్రైవింగ్, గృహ వాహన సంబంధ రిపేరులు, విద్యార్థులకు విద్యాసంబంధ అంశాల మీద ఆసక్తులు, నూతన విద్యా విషయం సేకరణ, కొత్త ప్రదేశాలలో ఆహార స్వీకరణ మొదలైన విషయాలు అస్థిరత పెంచుతాయి. వారాంతములో జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జూదములు అనవసరమైన పెట్టుబడుల జోలికి వెళ్లకుండా, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ, వృత్తిలో గౌరవాన్ని పెంపొందింప చేసుకుంటూ, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలలో అభివృద్ధితో, గృహసౌఖ్యాన్ని పెంపొందించుకునే, మనశ్శాంతి కొరకు  చింతామణి గృహం తస్తా శ్రీమన్నగర నాయక పారాయణ చేయడం మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


వారం ప్రారంభంలో తోబుట్టువులతో మిత్రులతో మంతనాలు జరిపేటప్పుడు, అభిప్రాయాలు స్థిరపరచుకొనేటప్పుడు, దగ్గర ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకునుట అతి ముఖ్యం.ధైర్య సాహసాలు పెరుగుతాయి, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు, అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో, నిర్ణయాలు తీసుకుని అభిప్రాయంలో, మీడియేటర్ షిప్ కి దూరంగా ఉండాలి. రైటింగ్ స్కిల్స్ ని పెంచుకోవాలి. స్థిరాస్తుల విషయాల్లో కుటుంబ సభ్యులతో వ్యత్యాసం రాకుండా వారి అభిప్రాయాలకు కూడా తగిన విధంగా గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. వృత్తి చేసే ప్రదేశాలలో మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు గౌరవంతో పెద్దల యొక్క ఆశీస్సులు సహకారాన్ని పొందగలుగుతారు. న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.సంతానం యొక్క అభివృద్ధి , ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది.  మంచి ఫలితముల కొరకు దుర్గాదేవి ఆరాధన.


 


(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa