శాంసంగ్ తన మిడ్ రేంజ్ ఎస్ సిరీస్ ఫోన్ Galaxy S25 FE (Fan Edition) ను అధికారికంగా లాంచ్ చేసింది. గత వారం గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ డివైస్ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో రానుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz కాగా, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ కలిగి ఉంది. ప్రాసెసింగ్ విషయంలో, శాంసంగ్ తయారు చేసిన శక్తివంతమైన Exynos 2400 4nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గత మోడళ్లతో పోల్చితే ఇందులో 10% పెద్ద వేపర్ ఛాంబర్ ఉండటంతో, మొబైల్ వేడి తగ్గించుకునే సామర్థ్యం మెరుగైంది. ఇది Android 16 ఆధారంగా తయారైన One UI 8పై రన్ అవుతుంది. గెలాక్సీ S25 సిరీస్ ఫోన్ల మాదిరిగానే, ఈ ఫోన్‌కు కూడా ఏకంగా 7 సంవత్సరాల పాటు Android మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభించనున్నాయి.కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8, OIS), 12MP అల్ట్రా వైడ్ కెమెరా (123° వ్యూ), మరియు 8MP టెలిఫోటో కెమెరా (3X ఆప్టికల్ జూమ్, OIS) ఉన్నాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా (f/2.2) ఉంది. డిజైన్ పరంగా, గ్లాస్ బ్యాక్‌తో పాటు ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉండటం వల్ల ఇది స్టైలిష్‌గా, బలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది IP68 రేటింగ్‌ను కలిగి ఉండి, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గల ఫోన్‌గా గుర్తింపు పొందుతుంది.ఇతర ముఖ్యమైన ఫీచర్లలో USB Type-C ఆడియో సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5G (SA/NSA), 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS + GLONASS, NFC లాంటి టెక్నాలజీ సపోర్ట్‌లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా చూస్తే, ఇది 4,900mAh సామర్థ్యం గల బ్యాటరీతో రాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంటుంది. మొబైల్ పరిమాణం 161.3×76.6×7.4mm కాగా, బరువు కేవలం 190 గ్రాములు మాత్రమే. ఇది నేవీ, జెట్ బ్లాక్, వైట్ అనే మూడు రంగుల్లో లభించనుంది.ధరల విషయానికి వస్తే, 8GB + 128GB వేరియంట్ ₹59,999, 8GB + 256GB వేరియంట్ ₹65,999, 8GB + 512GB వేరియంట్ ₹77,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 29 నుంచి ఈ ఫోన్‌ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ ఎక్స్‌క్లూసివ్ స్టోర్స్, ఇతర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.లాంచ్ ఆఫర్ల కింద, స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఆఫర్ ద్వారా ₹12,000 విలువైన 256GB కొనుగోలు చేస్తే 512GB వేరియంట్ ఉచితంగా లభిస్తుంది. అదనంగా ₹5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకూ నో కాస్ట్ EMI అవకాశాలు కూడా లభ్యమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa