జాజికాయని జాజికాయ చెట్టు గింజల నుండి తీస్తారు. సాధారణంగా మెత్తగా పొడి చేసి లేదా అలానే వీటిని వంటల్లో వాడతారు. కొద్దిగా తీపిగా, కారంగా ఉండే ఈ రుచి బేకింగ్ ఫుడ్స్ నుంచి సూప్స్, స్టూ, సాస్‌ల వంటి ప్రత్యేకమైన వంటలకాలకే కాకుండా, బిర్యానీ, మసాలా కూరల్లో కూడా వాడతారు. ఇందులోని గుణాల కారణం జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. నొప్పి తగ్గుతుంది. ఈ జాజికాయలోని గొప్ప గుణాల కారణంగా వంటల్లోనూ దీనిని వాడతారు. దీనిని మనం వంట్లో వాడితే కిలోలకొద్దీ బరువు తగ్గుతుంది. దాంతో పాటు కొలెస్ట్రాల్, ఒత్తిడి, నిద్రలేమి ఇలాంటి సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోవాలంటే జాజికాయని ఎలా వాడాలి. దానికి కారణమైన గుణాలు ఈ జాజికాయలో ఉన్నాయా. బరువు తగ్గడం కోసం జాజికాయని మన వంటల్లో ఎలా భాగం చేసుకోవాలో తెలుసుకోండి.
ట్యాక్సిన్స్ దూరం చేయడానికి
జాజికాయలోని గుణాలు బాడీలోని ట్యాక్సిన్స్‌ని తొలగిస్తాయి. అంతేకాకుండా జీవక్రియని పెంచుతాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేసే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. దీంతో బరువు తగ్గుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం జాజికాయని తీసుకోవడం వల్ల అజీర్ణం, వాంతులు, ప్రేగు కదలికల సమస్యలు వంటి వాటిని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి.
ఆకలి తగ్గుతుంది
జాజికాయని తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. దీంతో మాటిమాటికి కేలరీలను తీసుకోరు. ఇందులోని ఫైబర్ కారణంగా కాస్తా తిన్నా కూడా కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. బరువు పెరగడానికి ముఖ్య కారణం మధ్యమధ్యలో ఏవైనా తినడం. అలాంటి చిరుతిళ్ళు తినడానికి కారణమైన క్రేవింగ్స్‌ని జాజికాయ దూరం చేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. ఊబకాయాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఆకలిని తగ్గించడంలో ఈ జాజికాయ బాగా హెల్ప్ చేస్తుంది.
కొవ్వు కరిగేందుకు
జాజికాయలోని గుణాలు సహజంగానే బరువు తగ్గిస్తాయి. ఇది బాడీలోని కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ఈ అద్భుతమైన మసాలా దినుసులోని ఖనిజాలు పుష్కలం. అందులో ఒకటి మాంగనీస్. ఇది కొవ్వుల్ని విచ్చిన్నం చేస్తుంది. బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గితే ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్, గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.
నిద్ర సమస్యలు
జాజికాయలోని మరో అద్భుత గుణం . మంచి నిద్రని అందించడం. సరైన నిద్రలేకపోతే ఆటోమేటిగ్గా బరువు పెరుగుతారు. కానీ, జాజికాయ ఆ నిద్రలేమి సమస్యని కూడా దూరం చేస్తుంది. మంచి నిద్ర మీకు బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనికోసం జాజికాయ పొడిని మీరు హెర్బల్ టీలో కలిపి తాగొచ్చు. లేదా పాలలో కూడా కలిపి తాగొచ్చు.
ఒత్తిడి
ఒత్తిడి కారణంగా మన బాడీలో ఎన్నో సమస్యలొస్తాయ్. బరువు తగ్గడంలో విఫలమవుతున్నామంటే ఒత్తిడి కూడా కారణమవ్వొచ్చు. కాబట్టి, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గితే బరువు దానంతట అదే తగ్గుతుంది.
ఎలా తీసుకోవచ్చు
మీరు జాజికాయని వంటల్లోవాడొచ్చు. లేదా పాలలో కొద్దిగా పొడి వేసి తీసుకోవచ్చు. అలా కాదు, మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే జాజికాయ పొడితో కాఫీ కలిపి తాగండి. దీనికి పావు టీస్పూన్ జాజికాయ పొడిని కాఫీలో కలపండి. అది కూడా బ్లాక్ కాఫీలో మొత్తం కలపండి. కొద్దిగా కూడా ముద్దలుముద్దలుగా ఉండొద్దు. దీనిని ఇలా కలిపి తాగితే చాలు ఒత్తిడి, నిద్రలేమి, క్రేవింగ్స్, జీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ తగ్గి చాలా వరకూ బరువు ఆటోమేటిగ్గా తగ్గుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa