ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌ను ఢీకొట్టిన బొలెరో..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 04:41 PM

 అనంతపురం జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన సుంకన్న కుటుంబం బైక్‌పై వజ్రకరూర్ మండలంలో ఉన్న సుంకలమ్మ ఆలయానికి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న, కొడుకు సన్నీ అక్కడికక్కడే మృతి చెందగా.. కూతుళ్లు భవాని, కల్పన తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa