ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో 39 మంది RSS సభ్యులు అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 07:16 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల వేడుకలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పోరూర్ ప్రాంతం సమీపంలోని 39 మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులను చెన్నై పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులను ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. సంఘవిద్రోహ కార్యకలాపాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కానీ ఆర్ఎస్ఎస్ సభ్యులు వారి కార్యక్రమాన్ని చేసుకుంటే వారిని అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు.


ఆర్ఎస్ఎస్ వందేళ్ల పండుగ రోజే ఎందుకు?


1925లో విదయదశని నాడు స్థాపితమైన ఆర్ఎస్ఎస్ దసరా నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శాఖల్లోని సభ్యులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యప్పంతంగల్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో.. ఆర్ఎస్ఎస్ సభ్యులు గురు పూజ, ప్రత్యేక శాఖ శిక్షణా సెషన్ నిర్వహించారు. దీంతో పోలీసుల వారిలో దాదాపు 39 మందిని దాకా అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలో పూజ, ప్రత్యేక ఆర్ఎస్ఎస్ 'శాఖ' శిక్షణను నిర్వహించినందుకు అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.


అక్టోబర్ 2న విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభత్వం స్మారక స్టాంప్, కాయిన్‌ను విడుదల చేసింది. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజునే ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకోవడాన్ని స్టాలిన్ పాయింట్ ఔట్ చేశారు. "మన జాతిపితను హత్య చేసిన మతోన్మాది కలలకు రూపం ఇచ్చే ఆర్‌ఎస్‌ఎస్ ఉద్యమం శతాబ్ది సందర్భంగా.. దేశ నాయకత్వం స్మారక స్టాంపులు, నాణేలను విడుదల చేశారు. ఈ దయనీయ పరిస్థితి నుంచి.. మనం భారతదేశాన్ని విముక్తి చేయాలి! గాంధీ జయంతి సందర్భంగా దేశ పౌరులందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఇది!" అంటూ ఆర్ఎస్ఎస్‌పై మండిపడ్డారు.


భారత్.. అన్ని మతాల ప్రజలకు లౌకిక దేశమని స్టాలిన్ అన్నారు. మహాత్మా గాంధీ నిర్దేశించిన ప్రాథమిక సూత్రంపై ఈ దేశం స్థాపించబడిందన్నారు. ప్రజలలో వారు విద్వేష బీజాలు నాటబడినప్పుడల్లా, విభజన శక్తులు తలలు ఎత్తినప్పుడల్లా.. ఆ మహాత్మున బలం వారిని ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తూనే ఉంటుందని స్టాలిన్ పేర్కొన్నారు.


గతంలోనూ..


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 2023 అక్టోబర్‌లో తమిళనాడువ్యా్ప్తంగా ర్యాలీలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. అందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. అయితే భద్రతా కారణాలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయం చివరకు సుప్రం కోర్టుకు చేసింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఇలాంటి ర్యాలీలు, ఆందోళనలు ముఖ్యమంటూ.. స్టాలిన్ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa