AP: పన్ను రేట్లు తగ్గిన తర్వాత జీఎస్టీ వసూళ్లు పెరిగాయని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు తెలిపారు. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో 7.45 శాతం వృద్ధి నమోదయ్యిందని వెల్లడించారు. స్థూల సేకరణ 4.19 శాతం పెరిగిందన్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అన్ని రంగాల వసూళ్లు రూ.4,335 కోట్లు, గతేడాది ఇదే నెలకు సంబంధించిన రూ.4,045 కోట్లతో పోల్చితే 7.17 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేసిన మొత్తం వసూళ్లు రూ.26,686 కోట్లకు చేరాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa