AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ బృందం ఫ్రాన్స్‌లో పర్యటిస్తోంది. ఈ మేరకు పెట్టుబడి దారులతో మంత్రి గొట్టిపాటి వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. పారిస్‌లో ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈడీఎఫ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీలో విదేశీ పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa