అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు.ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్‌లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa