విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం, వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్న మిథున్‌రెడ్డి, యూఎస్ వెళ్లేందుకు తన పాస్‌పోర్ట్ విడుదల చేయాలని కోరారు. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయనకు ఈ అనుమతి లభించింది. అయితే, దేశం విడిచి వెళ్లే ముందు అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. గతంలో ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి సెప్టెంబర్ 29న షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa