ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకార కుటుంబాలని ఆదుకున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:13 PM

సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాకినాడ జిల్లాకు చెందిన 18 బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల పరిహారాన్ని కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందేలా కీలక పాత్ర పోషించారు.సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి, దురదృష్టవశాత్తు ప్రాణాలు విడిచిన ఈ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచి, పరిహారం మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa