ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమాలియాలో సమోసాపై నిషేధం.. కారణం వింటే షాక్ అవుతారు!

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 09:17 PM

భారతదేశంలో టీ దుకాణాల నుండి పెద్ద హోటళ్ల వరకు ఎక్కడ చూసినా కనిపించే సమోసాను సోమాలియాలో అల్-షబాబ్ తీవ్రవాద సంస్థ నిషేధించింది. 2011 నుండి అమల్లో ఉన్న ఈ నిషేధానికి కారణం సమోసా త్రిభుజాకారంలో ఉండటమే. త్రిభుజం క్రైస్తవ మతంలోని ట్రినిటీ చిహ్నాన్ని పోలి ఉందని, ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అని అల్-షబాబ్ వాదిస్తోంది. దీనితో సోమాలియాలో సమోసా తయారు చేయడం, అమ్మడం, తినడం నేరంగా పరిగణిస్తున్నారు. ఈ నిషేధం భారతీయ సంస్కృతిలో భాగమైన సమోసాకు అవమానంగా ఇండియన్స్ భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa