ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. టీడీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో జోగి రమేశ్ తనతో ఈ తతంగం నడిపించాడని జనార్ధన్ రావు ఆ వీడియోలో ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు, కేసుల నుంచి బయటపడేస్తానని, బెయిల్ ఇప్పిస్తానని జోగి రమేశ్ హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత మాట మార్చి తనను మోసం చేశారని జనార్ధన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో తన తమ్ముడిని కూడా అన్యాయంగా ఇరికించారని, జోగి రమేశ్ చేతిలో మోసపోవడం వల్లే ఇప్పుడు ఈ నిజాలు బయటపెడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రిపై నిందితుడు నేరుగా చేసిన ఈ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa