40, 50 ఏళ్ళు దాటాక తెల్ల జుట్టు రావడం కామన్. కానీ, అంతకంటే ముందుగానే తెల్ల జుట్టు వస్తే దానిని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. ఈ ప్రాబ్లమ్ రావడానికి స్ట్రెస్, పొల్యూషన్, కెమికల్స్‌తో కూడిన హెయిర్ ప్రోడక్ట్స్, సరిలేని డైట్ ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటన్నింటినీ మనం సరిచేసుకుంటూనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే తెల్లజుట్టుని తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు సాధారణంగానే జుట్టుని నల్లగా మారుస్తాయి. అయితే, ఇవి వెంటనే రిజల్ట్‌ని చూపించవు. కాస్తా టైమ్ పడుతుంది. అప్పటివరకూ ఎదురుచూడాలి. వీటిని ఫాలో అవ్వడం వల్ల చాలా వరకూ తెల్లజుట్టుని తగ్గించుకోవచ్చు. పైగా ఈ టిప్స్ అన్నీ కూడా ఇంట్లోని పదార్థాలతోనే ట్రై చేయొచ్చు. మరి పదార్థాలు ఏంటి? వాటితో ఎలా సమస్యని తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.
కరివేపాకు, కొబ్బరినూనె
కరివేపాకు, కొబ్బరినూనె రెండింటి కాంబినేషన్ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ఈ రెండింటిని కాంబినేషన్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బిలు ఉంటాయి. ఇవి మెలనిన్‌ని రిస్టోర్ చేసి నేచురల్‌గానే జుట్టుని నల్లగా కనిపించేలా చేస్తాయి. కొబ్బరినూనె, కరివేపాకు రెండు కూడా స్కాల్ప్‌ని నరీష్ చేసి కుదుళ్ళని బలంగా మారుస్తాయి.
ఎలా వాడాలి. గుప్పెడు తాజా కరివేపాకుల్ని అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. కరివేపాకులు పూర్తిగా నల్లగా మారాలి. తర్వాత ఆ ఆయిల్‌ని వడకట్టి గ్లాస్ జార్‌లో స్టోర్ చేయండి. ఈ నూనెతో వారానికి రెండుసార్లు మసాజ్ చేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయండి. కొన్ని వారాలకే ఆరోగ్యకరమైన, మృదువైన, నల్లని కురులు మీ సొంతమవుతాయి.
ఉసిరి
ఉసిరి కూడా జుట్టు సమస్యలకి ఎన్నో శతాబ్ధాలుగా మంచి పరిష్కారంగా ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిని వాడడం వల్ల మెలనిన్ ప్రొడక్షన్ పెరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.
ఎలా వాడాలి
మీరు ఉసిరిని జ్యూస్‌లా, పౌడర్‌లా, నూనె ఇలా ఏ రపంలో అయినా వాడొచ్చు.
కొద్దిగా ఉసిరిపొడిని నీటితో కలిపి పేస్టులా చేయండి. దీనిని స్కాల్ప్, హెయిర్‌కి రాసి 30 నుంచి 40 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత తలస్నానం చేయండి.
కొబ్బరినూనెలో ఉసిరి ముక్కలు వేసి మరిగించండి, తర్వాత వడకట్టండి. తర్వాత జుట్టుకి వాడండి.
తాజా ఉసిరి రసాన్ని ప్రతీరోజూ తీసుకోండి.
ఇలా ఏ రూపంలో తీసుకున్నా జుట్టు నేచురల్‌గానే నల్లగా మారుతుంది.
ఉల్లి రసం
ఉల్లిరసంలో కూడాఎన్నో గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుని పెంచడమే కాకుండా తెల్లబడడాన్ని తగ్గిస్తాయి. ఇందులోని కాటలేజ్ అనే ఎంజైమ్స్ హెయిర్ ఫోలికల్స్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉత్పత్తి కాకుండా చేస్తాయి. ఇది జుట్టు తెల్లబడడానికి ముఖ్య కారణం.
ఎలా వాడాలి?
దీనికోసం ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టి జ్యూస్ తీయాలి. దీనిని జుట్టుకి, స్కాల్ప్‌కి రాయాలి. 30 నిమిషాల పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనిని మీరు కొబ్బరినూనె, అలోవెరా జెల్‌లో కూడా కలపొచ్చు.
బ్లాక్ టీ
బ్లాక్ టీ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. దీనిని వాడడం వల్ల జుట్టుకి నేచురల్ డైలా పనిచేస్తుంది. ఇది జుట్టు మంచి రంగుని ఇచ్చి జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది.
ఏం చేయాలి. 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ పౌడర్‌ని నీటిలో వేసి మరిగించండి. దీనిని చల్లారనివ్వండి. దీనిని వడకట్టి షాంపూ తర్వాత ఈ నీటితో తలస్నానం చేయండి. అలానే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత నార్మల్ నీటితో తలస్నానం చేయండి. రెగ్యులర్‌గా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
హెన్నా, కాఫీ
హెన్నా కూడా జుట్టుని నల్లగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. మనం హెన్నా పౌడర్‌ని బ్లాక్ కాఫీ, టీలో కలిపి రాస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ఎలా వాడాలి?హెన్నా పౌడర్‌ని బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలో కలపండి. దీనిని 6 నుంచొ 8 గంటల పాటు లేదా రాత్రంతా అలానే ఉంచండి. తర్వాత జుట్టుకి రాసి 2 నుంచి 3 గంటల పాటు ఉంచి తర్వాత జుట్టుని క్లీన్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా ఉసిరిపొడి, కొన్ని చుక్కల యూకలపిస్ట్ ఆయిల్ కలిపితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీని వల్ల జుట్టు నేచురల్‌గానే నల్లగా మారుతుంది.
భృంగరాజ్ ఆయిల్
భృంగరాజ్ ఆయిల్ కూడా జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.
ఎలా వాడాలి. మీరు స్వచ్ఛమైన భృంగరాజ్ ఆయిల్‌ని కొనొచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేయొచ్చు. వాడే ముందు కొద్దిగా జుట్టుకి రాసి మసాజ్ చేయండి. రెగ్యులర్‌గా వాడితే జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.
ఏం తినాలి
కేవలం పై పూతలే కాకుండా కొన్ని ఫుడ్స్ కడా జుల్టుని నల్లగా మారేలా చేస్తాయి. దీనికోసం మీరు ఐరన్, విటమిన్ బి12, కాపర్, ప్రోటీన్ తీసుకోవచ్చు.
ఉసిరి, కరివేపాకులు, నట్స్, సీడ్స్
తాజా ఆకుకూరలు తీసుకోవాలి. పనీర్, పప్పులు, గుడ్లు తీసుకోండి.
కొబ్బరినీరు, బెల్లం, ఖర్జూరాలు తీసుకుంటే అందులోని మినరల్స్ జుట్టుని నల్లగా మారుస్తాయి.
దీంతో పాటు జంక్ ఫుడ్ తగ్గించాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి.
దీంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
మంచి నిద్ర ఉండేలా చసుకోండి.
ఎప్పటికప్పుడు స్కాల్ప్ హెల్దీగా ఉండేలా చసుకోండి.
దీంతో జుట్టు రిపేర్ అవ్వడమే కాకుండా మెలనిన్ అంది జుట్టు నల్లగా మారుతుంది.
జుట్టు నల్లగా మారడానికి ఇలాంటి ఇంటి చిట్కాలుఎంతగానో హెల్ప్ చేస్తాయి. దీంతో జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు నల్లగా త్వరగా మారదు. దీనికి కాస్తా టైమ్ పడుతుంది. కగారు పడొద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa