పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 131 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (46 నాటౌట్; 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోష్ ఫిలిప్ (37; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ తీశారు.131 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయగా, మాథ్యూషాట్ (8) అక్షర్ పటేల్ వెనక్కి పంపించడంతో ఆసీస్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa