దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజకు అనేక పౌరాణిక, ధార్మిక, సాంస్కృతిక కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమేసి, భక్తులకు ధనం, ధాన్యం, ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కార్తీక అమావాస్యకు ముందు త్రయోదశి రోజున లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించి, అమావాస్య రోజున విష్ణుమూర్తిని వరించిందని, అందుకే ఈ పర్వదినాన అమ్మవారిని పూజించడం ప్రీతికరమని భక్తులు భావిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa