AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa