సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. కంచె చేను మేసింది అన్న సామెత గుర్తుకు వస్తుంది. నేరస్తులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు.. వారి వద్ద నుంచి కూడా లంచం తీసుకుని.. వదిలేయడం నిజంగా విచారకరం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సుమారు 3 వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసం కేసులో నిందితుడైన ఓ వ్యక్తి వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు లంచంగా తీసుకుని.. అతడిని వదిలేశాడు ఓ ఎస్సై. ఆ తర్వాత సదరు నిందితుడు పరారయ్యడంటూ ఎసై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. కానీ ఉన్నతాధికారులు విచారణలో అనేక కీలకాంశాలు వెలగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం తెలంగాణలో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన ఆర్థిక మోసం వెలుగు చూసింది. పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలిస్తామంటూ ఆశ చూపడంతో.. చాలా మంది అమాయకులు ఆ కేటుగాడి మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత నిందితుడు జెండా ఎత్తేయడంతో మోసాపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
నిందితుడిని పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం.. అతడు మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించింది. నిందితుడిని అరెస్ట్ చేయడం కోసం... నిబంధనల ప్రకారం ఒక సీఐ నేతృత్వంలోని బృందాన్ని అక్కడికి పంపించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు మాత్రం.. ఓ ఎస్‌ఐ నేతృత్వంలోని టీమ్‌ను పంపించారు. అలా ముంబై వెళ్లిన బృందం.. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో సదరు ఎస్ఐ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. నిందితుడితో ఓ డీల మాట్లాడుకున్నాడు. తనకు రూ.2 కోట్లు ఇస్తే.. నిందితుడిని వదిలేస్తానంటూ ఒప్పందం కుదురర్చుకున్నాడు.
నిందితుడిని వదిలేందుకు డీల్ కుదుర్చుకున్న సదరు ఎస్‌ఐ తన ప్లాన్‌లో భాగంగా.. టీమ్‌లోని మిగతా సిబ్బంది అందరినీ ఒక వాహనంలో ఎక్కించాడు. తాను మాత్రమే నిందితుడితో కలిసి మరో వాహనంలో ఎక్కి హైదరాబాద్ బయలుదేశాడు. అలానే తమ కన్నాముందు బయలుదేరిన పోలీసుల వాహనానికికి.. తాను ప్రయాణిస్తున్న వాహనానికి మధ్య 30 కి.మీ దూరం ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఎస్ఐ తనను తప్పిస్తాడని నమ్మకం కుదరడంతో.. సదరు నిందితుడు తన కుటుంబ సభ్యులకు కాల్ చేసి.. రూ.2 కోట్లు తీసుకుని ఫలానా హోటల్ వద్దకు రావాలని తెలిపాడు.
నిందితుడి కుటుంబ సభ్యులు హోటల్‌కి వచ్చి.. అతడి కోసం ఎదురు చూడసాగారు. ఇక ఎస్‌ఐ కూడా నిందితుడిని తీసుకుని.. అదే హోటల్కి వెళ్లి వద్ద నుంచి డబ్బు తీసుకొని అతణ్ని వదిలేశాడు. ఆ తర్వాత సదరు నిందితుడు పారిపోయాడని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపాడు. తాను దారిలో వాహనాన్ని ఆపినప్పుడు నిందితుడు తప్పించుకు పారిపోయాడంటూ ఉన్నతాధికారులకు, టాస్క్‌ఫోర్స్ బృందానికి సమాచారం ఇచ్చాడు. టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు 2-3 బృందాలను రంగంలోకి దింపి నిందితుణ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.ఈ క్రమంలో సదరు ఎస్‌ఐ తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఎస్‌ఐ సాయంతోనే నిందితుడు తప్పించుకొని ఉంటాడని అనుమానించిన ఉన్నతాధికారులు.. అతడి మీద డిపార్టుమెంటల్ విచారణకు ఆదేశించారు.
ఈ విచారణలో.. ఎస్‌ఐ డబ్బు తీసుకుని నిందితుణ్ని వదిలేసినట్లు ప్రాథమింకగా వెల్లడయ్యిందని సమాచారం. దీంతో సదరు ఆ డబ్బు ఎక్కడ తీసుకున్నాడు.. ఎలా తీసుకున్నాడు.. దాన్ని ఎక్కడికి తరలించాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఆ ఎస్‌ఐ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. టాస్క్‌ఫోర్సు విభాగంలో చేరినప్పటి నుంచి అతడు గుట్టుగా అనేక దందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa