రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో.. అధికారులు 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌కు 2 లక్షల 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు మున్నేరు, కీసర, వైర, కట్టలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఈరోజు (గురువారం) సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలోని నదీతీర మండలాలు, గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa