ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంపర్ ఆఫర్.. చెత్త వేసేవారి ఫోటోలు పంపితే రూ. 250 నజరానా

national |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 02:56 PM

బెంగళూరులో నగర పరిశుభ్రతను పెంచేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML సంయుక్తంగా కొత్త పథకం ప్రారంభించాయి. రోడ్లపై చెత్త వేస్తున్న వారి ఫొటో లేదా వీడియో పంపితే ₹250 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక నంబర్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌, యాప్‌ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 5వేల ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతుండగా, చెత్తను రోడ్లపై వేస్తున్న వారికి ₹2వేల జరిమానా విధిస్తామని BSWML సీఈఓ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa