ప్రపంచవ్యాప్తంగా ఉన్నత చదువులు చదువుకోవాలనే చాలా మంది.. అమెరికా వైపు చూస్తూ ఉంటారు. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు అమెరికా వెళ్తూ ఉంటారు. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. ఫీజులు అధికంగా ఉన్నప్పటికీ.. మంచి యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే.. ఆ తర్వాత మంచి కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయని కష్టపడుతూ ఉంటారు. ఇక విద్యారంగంలో ప్రపంచదేశాల కంటే ముందు వరుసలో ఉన్న అమెరికాలో ఆధిపత్యం కోసం ఏటా అనేక యూనివర్సిటీలు పోటీ పడుతూ ఉంటారు. అయితే అమెరికాలోనే బెస్ట్ కాలేజెస్ 2026 ఎడిషన్ లిస్ట్‌ను యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసింది.
ఇక ఈ జాబితాలో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యంత విశిష్టమైన విద్యాసంస్థగా తన వారసత్వాన్ని నిలబెట్టుకుంది. యూనివర్సిటీల్లోని బోధనపై విశ్వసనీయత, ప్రొఫెసర్లు, రీసెర్చ్ ఫలితాలు, విద్యార్థుల భవిష్యత్తును ప్రతిబింబించేలా ఈ ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లలో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 10 యూనివర్సిటీలను (2, యూనివర్సిటీలు 4వ ర్యాంకు, 4 యూనివర్సిటీలు 7వ ర్యాంకును పంచుకున్నాయి) వెల్లడించారు.
ర్యాంక్ యూనివర్సిటీ పేరు స్థాపించబడిన సంవత్సరం అండర్‌గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్ ట్యూషన్ ఫీజు (సంవత్సరానికి)
1 ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ 1746 5,813 65,210 డాలర్లు
2 మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1861 4,535 64,730 డాలర్లు
3 హార్వర్డ్ యూనివర్సిటీ 1636 7,038 64,796 డాలర్లు
4 స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ 1885 7,904 68,544 డాలర్లు
4 యేల్ యూనివర్సిటీ 1701 6,814 69,900 డాలర్లు
6 యూనివర్సిటీ ఆఫ్ చికాగో 1890 7519 73,266 డాలర్లు
7 డ్యూక్ యూనివర్సిటీ 1838 6,523 73,172 డాలర్లు
7 జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ 1876 6356 67,170 డాలర్లు
7 నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ 1851 9,060 70,589 డాలర్లు
7 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1740 10,013 71,236 డాలర్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa