భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత మానవ వనరులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa