బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన మహిళా రోజ్ గార్ యోజన పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం మహిళలను ఆకట్టుకుంది. బీహార్‌లో 66.91% ఓటింగ్ నమోదు కాగా, 71.6% మహిళలు ఓటు వేశారు. ఈ వ్యూహం గతంలో MP, MH ఎన్నికల్లోనూ బీజేపీకి విజయాలు తెచ్చిపెట్టింది. దీంతో ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa