జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ ట్యాక్స్ చెల్లింపు నిబంధనల్లో పెద్ద మార్పులు చేస్తూ కొత్త విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది.ఈ నియమాలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా మార్పులు వాహనదారులకు మరింత అనుకూలంగా ఉండేలా, వారిపై భారం పడకుండా రూపొందించబడ్డాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ తగ్గించడం, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాలను తీసుకుంది.టోల్ గేట్ల వద్ద చెల్లింపులు మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతాయని జాతీయ రహదారుల సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలను పాటించకపోతే టోల్ ప్లాజాలో రెట్టింపు చార్జీలు విధించే అవకాశముందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఫాస్టాగ్ టెక్నికల్‌గా పనిచేయకపోయినా అదనపు టోల్ చెల్లించాల్సిందే. 2008 హైవే ఫీజుల నిబంధనలకు అనుగుణంగా ఈ సవరణలు తీసుకువచ్చారు.ఇంతకాలం ఫాస్టాగ్ లేన్‌లోకి ఎలాంటి వాహనం వచ్చినా, ట్యాగ్ స్కాన్ కాకపోయినా లేదా ట్యాగ్ లేకపోయినా ఒకే రకం చార్జి వసూలు అయ్యేది. కానీ ఇప్పుడు ఈ విధానం మారింది. చెల్లింపు పద్ధతి ఆధారంగా వేర్వేరు జరిమానాలు విధించబడతాయి.క్రొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ పనిచేయనప్పుడు డ్రైవర్ నగదు చెల్లిస్తే మరల రెట్టింపు టోల్ చార్జి వర్తిస్తుంది. అయితే అదే మొత్తాన్ని యూపీఐ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ మాద్యమాల ద్వారా చెల్లిస్తే కేవలం 1.25 రెట్లు మాత్రమే అదనంగా వసూలు అవుతుంది. ఉదాహరణకు– ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిన టోల్ 100 రూపాయలు అయితే, అది స్కాన్ కాకపోతే నగదు చెల్లింపులో 200 రూపాయలు పడుతుంది. కానీ డిజిటల్ పేమెంట్ చేస్తే 125 రూపాయలే చెల్లిస్తే సరిపోతుంది.ఫాస్టాగ్‌లో టెక్నికల్ లోపాలు, గడువు సమస్యలు లేదా రీడర్ సమస్యల వల్ల ట్యాగ్ స్కాన్ కాకపోవడం తరచూ చోటుచేసుకునేది. ముందుగా వాహనదారులు ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా రెట్టింపు చార్జి చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుండి డిజిటల్ చెల్లింపును ఎంచుకోవడం ద్వారా ఆ భారం కొంతవరకు తగ్గుతుంది.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం వల్ల టోల్ ప్లాజాల వద్ద క్యూ లు తగ్గి, వాహనాల కదలిక వేగవంతమవుతుందని జాతీయ రహదారుల సంస్థ చెబుతోంది. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, అలాగే నగదు లావాదేవీలు తగ్గడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. మానవ తప్పిదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa