టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ పాల్గొననున్నాయి.
ఈ 20 జట్లను మొత్తంగా నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లోని జట్టు మిగతా నాలుగు జట్లతో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. కాగా మొత్తంగా 20 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించగా.. ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఉందో ఇప్పుడు చూద్దాం..
గ్రూప్- ఏ
భారత్
పాకిస్థాన్
నమీబియా
నెదర్లాండ్స్
యూఎస్‌ఏ
గ్రూప్-బి
ఆస్ట్రేలియా
ఐర్లాండ్
ఒమన్
శ్రీలంక
జింబాబ్వే
గ్రూప్-సి
బంగ్లాదేశ్
ఇంగ్లాండ్
ఇటలీ
నేపాల్
వెస్టిండీస్
గ్రూప్-డి
అఫ్ఘానిస్థాన్
కెనడా
న్యూజిలాండ్
దక్షిణాఫ్రికా
యూఏఈ
టోర్నీ ఫార్మాట్ ఇదే..
ఈ టోర్నీ గత ప్రపంచకప్ ఫార్మాట్‌లోనే జరగనుంది. మొత్తంగా 20 జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. ఇందులో ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు మిగతా 4 జట్లతో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అక్కడ కూడా ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగతా 3 టీమ్స్‌తో ఆడుతుంది. సూపర్-8లో ఒక్కో గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఇక ఈ షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో ముంబైలో జరిగింది. ఇందులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు. రోహిత్ శర్మను టీ20 ప్రపంచకప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa