ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం అమ్మి కోటేశ్వరులైన ముగ్గురు యువకులు

international |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 05:11 PM

వారసత్వంగా వచ్చిన ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన ఓ పాత పుస్తకం ముగ్గురు యువకులను రాత్రికిరాత్రే కోటీశ్వరులను చేసింది. కామిక్ పుస్తకాల వేలంలో రికార్డు స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ మహిళ ఇటీవల కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఇటీవల వారు ముగ్గురూ తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇంట్లోని సామాన్లను తొలగించి శుభ్రం చేస్తుండగా పాతకాలం నాటి సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం దొరికింది. అప్పట్లో ఈ పుస్తకానికి చాలా క్రేజ్ ఉండేదని తెలుసుకున్న ముగ్గురు సోదరులూ దానిని వేలం వేయాలని భావించారు.ఇందుకోసం టెక్సాస్ లోని ఓ వేలం సంస్థను ఆశ్రయించారు. ఈ నెల మొదట్లో ఈ కామిక్ పుస్తకాన్ని వేలం వేయగా.. ఏకంగా 9.12 మిలియన్ డాలర్లకు (మన రూపాయల్లో సుమారు 81.25 కోట్లు) అమ్ముడుపోయింది. ఓ కామిక్ పుస్తకానికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని సదరు వేలం నిర్వహించే సంస్థ పేర్కొంది. దీంతో ఆ ముగ్గురు సోదరులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa