ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 10:25 AM

AP: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్‌కు పంపగా.. ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa