కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మార్కుటత్తిల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ యువతి సీఎం పినరయ్ విజయన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో తాము కొంతకాలం కలిసున్నామని.. తనకు బిడ్డ కావాలని బలవంతం చేసి, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని రాహుల్ బెదిరింపులకు పాల్పడ్డాడని యువతి పేర్కొంది. కాగా దీనిపై ఎమ్మెల్యే రాహుల్ స్పందిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. కుట్రపూరితంగా తనపై కేసు నమోదు చేశారని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa