AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలైన ఎన్ఎంయూఏ, ఎంప్లాయిస్ యూనియన్‌లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు ప్రధాన సంఘాలకు ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేశారు. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, హక్కులు నేరుగా ప్రభుత్వంతో చర్చించే అవకాశం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa