ఇంట్లో దొరికే కొబ్బరి నూనె, ఉసిరి పొడితో తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆమ్లాలో విటమిన్లు E, K పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెతో ఉసిరి పొడిని కలిపి తలకు రాస్తే జుట్టు మూలాలు బలపడి, పెరుగుదల మెరుగుపడుతుంది. జుట్టు రాలడాన్ని, తెల్లబడటాన్ని, పల్చబడటాన్ని నియంత్రిస్తుంది. చుండ్రు, పొడిబారడం నుండి రక్షించి, సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని అరగంట తర్వాత షాంపూతో కడిగేయాలని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa