ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబు చొరవ చూపి పరిష్కరిస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. రుణాలు సకాలంలో తీర్చబడ్డాయని, స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు 9% తగ్గాయని, 7,000 మందికి పదోన్నతులు వచ్చాయని, రిటైర్డ్ ఉద్యోగుల EHS పునరుద్ధరించబడిందని ఎండీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa