ఆడవారు ముఖంపై ఉన్న హెయిర్‌ని రిమూవ్ చేయించుకోవాలనుకుంటారు. దీనికోసం రకరకాల మెథడ్స్ ఫాలో అవుతారు. అందులో షేవింగ్ ఒకటి. దీని వల్ల ఫేస్‌పై ఉన్న హెయిర్ రిమూవ్ అయి స్కిన్ సాఫ్ట్‌గా అనిపిస్తుంది. పైగా దీని వల్ల డెడ్ స్కిన్ సెల్స్ కూడా తగ్గుతాయి. అయితే, బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొంతమందికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, షేవింగ్ తర్వాత దద్దుర్లు, మొటిమలు పెరిగాయని అంటారు. అలా కాకుండా ఉండేందుకు డెర్మటాలజిస్ట్ సురభి బలాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. అదేంటంటే
ముందుగా గోరువెచ్చని నీటితో క్లీన్ చేయడం
షేవింగ్ చేసే ముందుగా స్కిన్‌ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీని వల్ల స్కిన్‌పై ఉన్న హెయిర్ మొత్తం మృదువుగా మారుతుంది. దీంతో రేజర్ కూడా సరిగ్గా గ్లైడ్ అవుతుంది. అందుకే ముందుగా కచ్చితంగా ఫేస్ క్లీన్ చేయాలి.
హైడ్రేటింగ్, షేవింగ్ జెల్ రాయడం
డ్రై స్కిన్ ఉన్నవారు ఎప్పుడు కూడా అలానే షేవ్ చేయిందు. ముందుగా ఏదైనా షేవింగ్ జెల్ లేదా క్రీమ్ వంటివి చేయాలి. దీని వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. రేజర్ కారణంగా ఎలాంటి కోతలు, ఎరుపు, చికాకు కాకుండా ఉంటుంది.
షార్ప్ రేజర్ వాడడం
పాతవి, ఎక్కువసార్లు వాడిన రేజర్స్ వాడితే సరిగ్గా పనిచేయవు. జుట్టుని లాగుతాయి. దీంతో చర్మంపై చికాకు, ఇతర సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, మీరు షేవ్ చేసుకునే ప్రతీసారి క్లీన్ రేజర్ని వాడడం మంచిది. మంచి షార్ప్‌గా ఉన్నది వాడండి.
జుట్టు పెరిగే డైరెక్షన్లోనే
షేవ్ ఎప్పుడు చేసినా కూడా జుట్టు ఎలా పెరుగుతుందో అలానే షేవ్ చేయాలి. అలా కాకుండా అపోజిట్ డైరెక్షన్లో లేదా ఇష్టమొచ్చినట్లుగా చేస్తే నొప్పి ఉంటుంది. సరిగ్గా షేవ్ అవ్వదు కూడా.
స్క్రబ్స్, కెమికల్స్ వాడొద్దు
షేవ్‌కి ముందు కనీసం 24 గంటల ముందు రెటినోల్, AHA, BHA లేదా స్క్రబ్స్ వంటివి వాడడం చేయొద్దు. ఇవి మీ స్కిన్‌ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్‌ని స్మూత్‌గా మారుస్తాయి. ఆ తర్వాత మనం షేవ్ చేస్తే చర్మంపై సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మొటిమలు ఉంటే వద్దు
చర్మంపై ఎక్కువగా మొటిమలు, దద్దుర్లు, చీము నిండిన కురుపులు ఉన్నప్పుడు షేవ్ చేయకపోవడమే మంచిది. చేస్తే ఇన్ఫెక్సన్ పెరుగుతుంది. సమస్య మరింత పెరుగుతుంది. అందుకే, అలా ఎప్పుడు కూడా చేయొద్దు.
షేవ్ తర్వాత
షేవింగ్ తర్వాత మంట, చికాకు లేకుండా ఉండేందుకు అలోవెరా జెల్ లేదా మైల్డ్ మాయిశ్చరైజర్ రాయండి. అలానే సన్‌స్క్రీన్ కూడా వాడడం ముఖ్యమే. కాబట్టి, బయటికి వెళ్లే ముందు బ్రాడ్ స్పెక్ట్రమ్ SPFని అప్లై చేయండి. డెర్మటాలజిస్ట్ ప్రకారం, షేవ్‌కి ముందు, తర్వాత మంచి స్కిన్ కేర్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. స్కిన్ హెల్దీ అండ్ గ్లోయింగ్‌గా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa