ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షీణించిన ఇండిగో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 10:36 AM

నవంబర్ నెలలో ఇండిగో సంస్థ విమాన సర్వీసుల రద్దు కారణంగా దేశీయ మార్కెట్ వాటా 63.6%కి పడిపోయింది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది నిబంధనలు, షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణం వంటి కారణాలతో ఇండిగో భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. అక్టోబర్‌లో ఈ వాటా 65.6%గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా గ్రూప్ వాటా 26.7%కి, స్పైస్‌జెట్ వాటా 3.7%కి పెరిగాయి. అకాసా ఎయిర్ వాటా 4.7%కి తగ్గింది. ఈ వివరాలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa