ఔషధాలకు లొంగని వైరస్ ‘కాండిడా ఆరిస్’ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోందని, గతం కంటే ఇది ప్రాణాంతకంగా మారుతోందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. భారతీయ శాస్త్రవేత్తల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయన ఫలితాలను మైక్రోబయాలజీ అండ్ మాలిక్యూలర్ బయాలజీ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించారు. డ్రగ్ రెసిస్టెన్స్ ఆరోగ్య రంగానికి సరికొత్త సవాల్ విసురుతోందని అధ్యయనకర్తలు హెచ్చరించారు.ఈ అధ్యయనాన్ని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వల్లభ్‌భాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్, అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి.
ఏటా ఈ ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.5 మిలియన్ల మందిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.. యాంటీ ఫంగల్ చికిత్సకు కూడా ఇవి లొంగడం లేదని, మరణాల రేటు 50 శాతానికి పైగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. బహుళ ఔషధాలను నిరోధించే శక్తి ఉండటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. మానవ చర్మంపై ఈ వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించి, తద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు.
ఈస్ట్ నుంచి ఫిలమెంట్‌గా రూపాంతరం చెందడం, మారుతున్న వాతావరణానికి ప్రతిస్పందనగా దాని ఫినోటైపిక్ జన్యు వ్యక్తీకరణ, కణసమూహాలను ఏర్పరచుకోవడం వంటి కణస్థాయి వ్యూహాలతో మనుగడ సాగిస్తుట్టు జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక పేర్కొంది. అంతేకాదు, చర్మం, నిర్జీవ ప్రదేశాలపై కూడా గమ్ మాదిరిగా అతుక్కుపోయే గుణం ఉందని తెలిపారు. దీంతో ఆసుపత్రుల్లో చేరిన రోగుల నుంచి ఇతరులకు ఇది సులభంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు, సాధారణ ల్యాబ్ పరీక్షల్లో కాడిడ్ ఆరస్‌ను గుర్తించడం కష్టమని అభిప్రాయపడ్డారు. తరచుగా దీనిని వేరే ఈస్ట్‌గా పొరబడే అవకాశం ఉండటంతో చికిత్సలో జాప్యం జరుగుతుందని అధ్యయనకర్తలు వివరించారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి కొత్త రకం యాంటీ ఫంగల్ ఔషధాలు, మెరుగైన వ్యాక్సిన్లు, అధునాతన వ్యాధి నిర్దారణ పరీక్షలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు.
‘ఈ డేటాను సమగ్రంగా పరిశీలిస్తే మానవుల్లో ఫంగల్ వ్యాధుల చికిత్స కోసం విస్తృత ప్రభావం కలిగిన కొత్త యాంటీ-ఫంగల్ ఔషధాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచడం, అధిక ముప్పు కలిగిన బాధితుల చికిత్సకు తోడ్పడే రోగనిరోధక, వ్యాక్సిన్ ఆధారిత విధానాలను అభివృద్ధి చేయడం కూడా అత్యంత కీలకం’ అని పరిశోధకులు సూచించారు. ఈ అధ్యయనం ఫంగల్ వ్యాధులపై అవగాహన పెంచడం ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉన్న దేశాల్లో మెరుగైన పర్యవేక్షణ (సర్వైలెన్స్) వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కూడా తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa