ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త బిల్డింగ్‌లపై దిష్టిబొమ్మకు బదులు మహిళ ఫోటో..,,ఆ సంగతేంటీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 10:09 PM

కర్ణాటక, మరీ ముఖ్యంగా దాని రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద పెద్ద ఏర్పాటు చేస్తున్న దిష్టి బొమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దిష్టిబొమ్మలు వైరల్ అవుతుండటం ఏంటి అని ఆలోచిస్తున్నారా. అవి సాధారణ దిష్టిబొమ్మలు కాదు.. ఒక మహిళ ఫోటోను దిష్టిబొమ్మల్లా వాడుతున్నారు. ఎక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నా ఇప్పుడు ఆ మహిళ ఫోటోనే దర్శనం ఇస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి ఫోటోలను కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇప్పుడు అంతా ఆ ఫోటో గురించే చర్చించుకుంటున్నారు.


కర్ణాటకలో నివసించే ఒక మహిళ (@unitechy) తాను ప్రయాణించేటప్పుడు కొత్త కొత్త భవనాలపై ఇలాంటి వింత పోస్టర్లను గమనించింది. అయితే ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరు అనేది గూగుల్ లెన్స్ ద్వారా వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె ఎక్స్‌ వేదికగా ఈ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరు అంటూ ఆమె ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇళ్ల నిర్మాణ సమయంలో దిష్టి తగలకుండా గుమ్మడికాయలు లేదా రాక్షసుల ముఖం ఉన్న బొమ్మలను కడతారు. అయితే.. కాలక్రమేణా ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తూ ఈ మహిళా ఫోటోను నజర్ బట్టు లేదా నజర్ కవచ్‌లా ఉపయోగిస్తున్నారు.


ఎవరీ మహిళ?


ఇంటర్నెట్‌లో నెటిజన్లు తెగ వెతికేసి.. ఆమె ఒక యూట్యూబర్ అని గుర్తించారు. ఆమె పేరు నిహారిక రావు అని.. ఆమె కర్ణాటకకు చెందిన యూట్యూబర్ అని వెల్లడైంది. 2023లో వైరల్ అయిన వీడియో క్లిప్ నుంచి సేకరించిన ఫోటో.. అందులో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బాగా వైరల్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ బిగ్ ఐడ్ మిస్టరీ ఉమెన్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ మీమ్ కాస్తా ఇప్పుడు భవనాలపై దిష్టిబొమ్మగా స్థిరపడిపోయింది. భయంకరమైన రాక్షసుల బొమ్మల కంటే.. ఇలాంటి ఫన్నీ, వింతైన మీమ్ పోస్టర్లు ఇంటికి దిష్టి తగలకుండా.. జనాల చూపును పక్కదారి పట్టించడానికి బాగా పనిచేస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అందుకే బెంగళూరు మార్కెట్లలో కూడా ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa