ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6 ఏళ్ల అప్‌డేట్స్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్!

Technology |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:30 PM

Samsung Galaxy A07 5G:శాంసంగ్ కంపెనీ తన A-సిరీస్ లైనప్‌లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Samsung Galaxy A07 5G పేరుతో ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.గత ఏడాది ఆగస్టులో విడుదలైన Galaxy A07 4G మోడల్‌కు ఇది 5G వెర్షన్. పెద్ద బ్యాటరీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ వైలెట్ రంగుల్లో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. భారత్‌లో లాంచ్‌పై ఇప్పటివరకు శాంసంగ్ నుంచి అధికారిక సమాచారం లేదు.
*Samsung Galaxy A07 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:Galaxy A07 5Gలో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను అమర్చారు.ఈ ఫోన్‌లో 6nm ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రత్యేక స్లాట్ ద్వారా 2TB వరకు మైక్రోSD కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.Galaxy A07 5G ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 6 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తో పాటు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు అందిస్తామని శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8), 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించారు.ఈ ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.Galaxy A07 5Gలో 5G Sub-6, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.3, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ లభిస్తుంది. ప్రత్యేక Key Island డిజైన్‌తో పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉన్నాయి. పవర్ బటన్‌కే సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను అందించారు.
*థాయ్‌లాండ్‌లో ఈ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి:
4GB RAM + 128GB స్టోరేజ్ – THB 5,499 (సుమారు రూ.15,800)
6GB RAM + 128GB స్టోరేజ్ – THB 5,999 (సుమారు రూ.17,200)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa