అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ ఆరోపణలు చేయడంతో కేరళలో దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో పోలీసులు ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పురిగొల్పారంటూ కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు FIR నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గోవిందాపురానికి చెందిన దీపక్ ఒక టెక్స్టైల్ సంస్థలో పనిచేస్తున్నారు. గత శుక్రవారం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ మహిళ ఆరోపణలు చేసింది. మనస్తాపానికి గురైన దీపక్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa