నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, జయదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. సంతానం లేని బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమకు చెందిన సుమారు రూ. 2 కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళంగా అందజేశారు.గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వృద్ధ దంపతుల సేవా నిరతిని కొనియాడుతూ, గ్రామంలో ఊరేగించి ఘనంగా సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa