ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పీక్ కు చేరాయి.. తమ లీడర్ కు హాని తలపెడితే ప్రపంచమే తగలబడిపోతుందని ఇరాన్ హెచ్చరించగా.. తనను హత్య చేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.తనపై ఇరాన్ హత్యాయత్నం చేస్తే.. తాను బతికి ఉన్నా, చనిపోయినా సరే.. ఆ దేశాన్ని భూస్థాపితం చేయాలని తన సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ చెప్పారు. ఇరాన్ లో జరుగుతున్న అల్లర్లకు మద్దతు పలుకుతున్న ట్రంప్ పై ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా ఖమేనీ మండిపడ్డారు.ఈ క్రమంలోనే తమ నాయకుడిపై చేయి వేయాలని చూస్తే ఆ చేతిని తెగనరుకుతామని, ఖమేనీకి ఏదైనా జరిగితే ప్రపంచాన్ని తగలబెడతామని ఇరాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ.. తనను చంపేయాలని చూసినా, చంపేసినా మీరు భూమ్మీదే ఉండరని తీవ్ర హెచ్చరికలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa