దక్షిణ రైల్వే పరిధిలో ఇటీవల ప్రారంభమైన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ మూడు అమృత్ భారత్ రైళ్లతో పాటు మరో రైలు కూడా కొన్ని స్టేషన్లలో సమయాల్లో సవరణ పొందింది. దక్షిణ రైల్వే అధికారులు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించి, ఏరువారీ నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయో కూడా వెల్లడించారు.నాలుగు అమృత్ భారత్ రైళ్లలో మార్పులు
*దక్షిణ రైల్వే ప్రాంతంలోని ఎంపిక చేసిన స్టేషన్లలో ఈ నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను సవరించారు:
రైలు నం.16108: సత్రగచ్చి – తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
రైలు నం.20610: తిరుచ్చిరాపల్లి – న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
రైలు నం.20604: న్యూ జల్పైగురి – అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
రైలు నం.16121: తాంబరం – తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
ప్రయాణికులు తమ ప్లాన్ ప్రకారం కొత్త సమయాలను గమనించుకోవడం అవసరం అని అధికారులు సూచించారు.
ఏపీలో టైమింగ్స్ మార్పులు
-రైలు నం.16108 (సత్రగచ్చి – తాంబరం):శ్రీకాకుళం రోడ్ నుంచి నెల్లూరు స్టేషన్ వరకూ స్వల్ప మార్పులు. తాంబరానికి రాకుయే సమయం 10 నిమిషాలు ముందుగా, ఉదయం 9:05 గా సవరించబడింది. ఫిబ్రవరి 7 నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయి.
-రైలు నం.20610 (తిరుచ్చిరాపల్లి – న్యూ జల్పైగురి):ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చబడ్డాయి. ఈ మార్పులు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి.
-రైలు నం.20604 (న్యూ జల్పైగురి – అమృత్ భారత్):ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో సమయాలను స్వల్పంగా సవరించారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి.
-రైలు నం.16121 (తాంబరం – తిరువనంతపురం):కేవలం తాంబరం స్టేషన్లోనే సమయాన్ని స్వల్పంగా సవరించారు.దక్షిణ రైల్వే ఈ మార్పులను అధికారిక ట్వీట్లో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa