కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 1 ఆదివారం స్టాక్ మార్కెట్‌లో ప్రత్యేకంగా ట్రేడింగ్ జరగనుంది. సాధారణ ట్రేడింగ్ రోజుల్లో మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయి.అలాగే ఎంసీఎక్స్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటి సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అయితే ఈసారి యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనుండటంతో, ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచి ఉంటుంది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన సందర్భం కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa