ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. 1989 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న వైమానికదళ అధికారులతో జరుగుతున్న సమావేశానికి ఈసారి హాజరు కాలేదు. ఇరాన్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం, ఈ సమావేశం 1979 ఫిబ్రవరి 8న వైమానిక దళ అధికారులు రూహుల్లా ఖమేనీకి విధేయత చూపిన రోజును గుర్తుచేస్తుంది. కోవిడ్ సమయంలో కూడా ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్రహీం మౌసవి వైమానిక దళ అధికారులతో సమావేశమయ్యారు. అమెరికాతో విభేదాలు ముదిరిన నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి ఖమేనీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యూఎస్ నిమిట్జ్-క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అరేబియన్ సముద్రంలో ఉంది. జోర్డాన్‌లోని మువఫ్ఫక్ సల్తి ఎయిర్ బేస్‌కు డజన్ల కొద్దీ ఎఫ్-15 ఫైటర్ జెట్లు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్, ఎ-10సి థండర్‌బోల్ట్ II గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ చేరాయి. రెడ్ సీలో యూఎస్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ డెల్బర్ట్ డి బ్లాక్, గల్ఫ్‌లో ఎంక్యూ-4సి ట్రైటన్ సర్వైలెన్స్ డ్రోన్ కూడా కనిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రంప్ ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa