టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ దారుణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే పావిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తూ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అభిషేక్.. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లోనూ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. సూపర్-8 దశకు ముందు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫామ్ అందుకుంటాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. భారత సంతతి స్పిన్నర్ ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.7 ఇన్నింగ్స్‌లు… 5 సార్లు సున్నా అభిషేక్ శర్మ గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌట్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అతని స్కోర్లు ఇలా ఉన్నాయి: 0 (1), 68* (20), 0 (1), 30 (16), 0 (1), 0 (4), 0 (3). ఒకే ఒక్క అర్ధశతకం మినహా మిగతా ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా వరుసగా మూడు డకౌట్లు నమోదు కావడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.ఈ పేలవ ప్రదర్శనతో అభిషేక్ పలు చెత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన నాలుగో ఆటగాడు, రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా, ఆండ్రీ ఫ్లెచర్, రోజర్ ముకాస ముందున్నారు.అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఆటగాడిగా ఈ చెత్త ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు.అభిమానుల అసంతృప్తి వరుస వైఫల్యాలతో అభిషేక్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ‘ఫియర్లెస్ గేమ్’ పేరుతో నిర్లక్ష్యంగా ఆడకూడదని, జట్టు ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa