ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి,,,, పరిహారం ప్రకటించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 06:22 PM

రాజమండ్రి ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయంపై శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి పాల సరఫరా జరిగిందని చంద్రబాబు తెలిపారు. పాల నమూనాలు సేకరించి హైదరాబాద్‌లో ల్యాబుకు పంపించామన్న చంద్రబాబు.. పాలలో కల్తీ జరిగినట్లు తేలితే క్షమించేది లేదని హెచ్చరించారు.


కల్తీ పాల ఘటన.. మరణాలపై అసెంబ్లీలో మంత్రి ప్రకటన


మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నలుగురు చనిపోయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమండ్రిలో మరణాలపై ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 12 మంది ఆస్పత్రిలో చేరారన్న మంత్రి.. అందులో నలుగురు చనిపోయినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఇద్దరికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు.


రాజమండ్రి బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు


మరోవైపు రాజమండ్రిలో కల్తీ పాల బాధితుల కోసం హెల్ప్‌‍లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి, అనారోగ్యానికి గురైతే తెలియజేయడానికి 9494060060 ను సంప్రదించవచ్చని కలెక్టర్ కీర్తి తెలిపారు. లాలాపేట చెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్‌‌లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాలు పోసిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పాలవ్యాపారి 46 మంది రైతుల వద్ద నుంచి పాలను సేకరించి 106 కుటుంబాలకు సరఫరా చేశారని కలెక్టర్ వివరించారు. ఆదివారం రాత్రి నుంచి 73 మంది నుంచి నమూనాలు సేకరించి, పరీక్షల కోసం పంపించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు.


తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రియాక్షన్


మరోవైపు పాల వ్యాపారి ఇంటి వద్ద ఉన్న మెటీరియల్ సీజ్ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa