ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఈ రోజు పాకిస్తాన్ - శ్రీలంక మధ్య రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ 2లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం, పాకిస్తాన్‌కు చావో రేవో పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఆధ్యంతం ఆకట్టుకునే పరిస్థితి ఉంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోతే సూపర్ 8 నుంచి నిష్క్రమించనుంది. మరోవైపు శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు కెప్టెన్ శనక బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి రానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే మినిమం 151-198 పరుగులు పైగా చేసి, 64కి పైగా పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. లేకపోతే 103-150 పరుగుల మధ్య చేసి 63కి పైగా పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ తొలుత బౌలింగ్ చేస్తే శ్రీలంకను 153-163 పరుగుల లోపు కట్టడి చేసి 13.2 ఓవర్లలో ఛేజింగ్ చేయాలి.. లేకపోతే 176-186 టార్గెట్ ఉంటే 13.4 ఓవర్లలో ఛేజ్ చేయాలి. కానీ ఈ మ్యాచ్‌లో పాక్ చేస్తుంది కాబట్టి చేయాల్సి ఉంటుంది.
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో శ్రీలంక - పాకిస్తాన్ జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండు జట్లు టీ20 వరల్డ్‌కప్ వేదికలపై నాలుగు సార్లు తలపడితే పాకిస్తాన్ రెండు సార్లు విజయం సాధించగా, శ్రీలంక రెండు సార్లు గెలిచింది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్లలలోనూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.
ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో శ్రీలంక మూడు విజయాలతో సూపర్ 8లో అడుగుపెడితే, పాకిస్తాన్ కూడా మూడు విజయాలు సాధించింది. సూపర్ 8లో శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోతే.. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో ఓడగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం ఒక పాయింట్‌తో ఉన్న పాక్, ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే సెమీస్‌కు వెళ్లనుండగా.. న్యూజిలాండ్ ఇంటిదారి పట్టనుంది. ఈ రోజుతో గ్రూప్ 2 నుంచి సెమీస్‌కి వెళ్లే రెండో జట్టు ఫైనల్ కానుంది.
పాకిస్తాన్ జట్టు
షాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), ఖవాజ్ నఫాయి, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షాఫ్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సంక, కుశాల్ మిషారా, చరిత అసలంక, కుశాల్ మెండిస్, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దాషున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, జనిత్ లియానగే, దుష్మంత చమీరా, మహీష్ తీక్షణ, దిల్షాన్ మధుశంక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa