ట్రెండింగ్
Epaper    English    தமிழ்

164 రోజులు రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్..హోలీకిబీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

business |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 10:28 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరోసారి కొత్త ఆఫర్‌తో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగ్ బర్సె కనెక్షన్ నా టర్సే అంటూ అదనపు వ్యాలిడిటీ అందిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా అకౌంట్లో ఓ పోస్ట్ చేసింది. ఒక్కసారి రీఛార్జ్‌తో ఎక్కువ రోజులు తమ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉండొచ్చని తెలిపింది. ఈ హోలీ పండగను ప్రత్యేక ఫెస్టివ్ ఆఫర్ ద్వారా మరింత రంగుల మయం చేసుకోవాలని, 14 రోజుల పాటు ఎక్స్ ట్రా వ్యాలిడిటీ అందిస్తున్నట్లు వెల్లడించింది. మరి ఈ ఆఫర్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


బీఎస్ఎన్ఎల్ ఈ హోలీ పండగ సందర్భంగా రంగాన్ కా సెలబ్రేషన్- నాన్ స్టాక్ కనెక్షన్ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌ ద్వారా ఆఫర్ ప్రకటించింది. రూ. 997 ప్లాన్ ద్వారా ఈ హోలీని ఎక్కువ కాలం జరుపుకోండి అని, 14 రోజులు అదనపు వ్యాలిడిటీ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ రూ. 997 ప్లాన్ వ్యాలిడిటీ అనేది 150 రోజులుగా ఉండగా ఈ హోలీ పండగ ఆఫర్ సమయంలో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజులు అదనంగా కాలపరిమితి పెరుగుతుంది. అంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ హోలీ ఆఫర్ అనేది మార్చి 1, 2026 రోజునే మొదలైపోయింది. మార్చి 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ఈరోజు రీఛార్జ్ చేసుకోండి, మీ హోలీ వేడుకలను రంగులు వెలిచిపోయిన తర్వాత కూడా చేసుకోండి అంటూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేపట్టింది. బీఎస్ఎన్ఎల్ 5జీ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దసరా, దీపావళి, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా రూ. 1 కే సిమ్ కార్డు అందించడంతో పాటు ఉచితంగా 30 రోజుల వ్యాలిడిటీ రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ రూ. 1 ఫ్రీడమ్ ఆఫర్‌కి మంచి స్పందన రావడంతో పలు మార్లు అందించింది. ఇప్పుడు హోలీ ప్రత్యేక రంగోలీ సెలబ్రేషన్స్ ఆఫర్ తెచ్చింది. పాత రేటుతోనే ఏకంగా రెండు వారాలు అదనపు వ్యాలిడిటీ కల్పిస్తుండడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa