రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలోని మాతృశ్రీ గడి బాపనమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల పోస్టర్ను గురువారం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విడుదల చేశారు. ఈ జాతర ఈ నెల 14 నుంచి 18 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ పండుగలు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాతర నిర్వహణకు మరియు ఆలయ అభివృద్ధికి తన వంతుగా రూ.1 లక్ష విరాళం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa